దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలు అతలాకుతలం అయ్యారు.. నిన్న పశ్చిమ బెంగాల్ లో ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు కూడా పడ్డాయి. పిడుగు పాటుకు ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ని మాల్దా జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు చిన్నారులతో పాటు ఏడుగురు మృతి చెందారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మాల్దాలోని బంగిటోలా హైస్కూల్ సమీపంలో పాఠశాల వేళల్లో పిడుగుపడి 12 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.. మృతులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందినవారు..
అయితే ఈ ఘటన లో మొత్తం తొమ్మిది పశువులు మృతి చెందినట్లు డీఎం తెలిపారు. మాల్దాలో ని బంగిటోలా హైస్కూల్ సమీపంలో పాఠశాల వేళల్లో పిడుగు పడి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం బంగిటోలా రూరల్ హాస్పిటల్, మాల్దా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించినట్లు నితిన్ సింఘానియా తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు..
ఇక రానున్న 24 గంటల్లో కోల్‌కతాతో పాటు బెంగాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో దాదాపు అన్ని దక్షిణ బెంగాల్ జిల్లాల ను రుతుపవనాలు ముంచెత్తుతాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. గత 48 గంటల్లో కోల్‌కతా తో సహా దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. వేడి-తేమతో కూడిన పరిస్థితుల నుండి నగరవాసులకు కొంత ఉపశమనాన్ని కలిగినట్లు తెలిపారు… రానున్న ఐదు రోజుల్లో ఉత్తర బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగవచ్చు. వర్షాల కారణంగా కొండల్లో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. మరోవైపు అస్సాం భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచేత్తుతున్నాయి.. మరో మూడు రోజులు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు..