నేడు పాట్నా వేదికగా విపక్షాల సమావేశం.. బీజేపీని అడ్డుకోవడమే టార్గెట్..
జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. గురువారం ఆమె ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలిశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్యారు. నితీష్ తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మేమంతా ఒకే కుటుంబంగా కలిసి పోరాడుతామని విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
మరోవైపు శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి పాట్నా బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో విపక్షాలన్ని సమావేశమవుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీని గద్దె దించడానికి జయప్రకాష్ నారాయణ చేసిన విధంగానే ఈసారి నితీష్ కుమార్ చేయాలని భావిస్తున్నారు.
భారత్‌లో చిప్ ఫ్యాక్టరీ.. కన్ఫామ్ చేసిన మైక్రాన్
భారతదేశంలో చిప్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం మైక్రాన్ ప్రకటించింది. గుజరాత్ లో 825 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 6,760 కోట్లు) పెట్టుబడితో ఈ ప్యాక్టరీ నెలకొల్పనున్నట్లు నిర్దారించింది. 2023లోనే మైక్రాన్ ఫ్యాక్టరీ నెలకొల్పే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. రెండు దశల్లో ఈ ప్యాక్టరీని నెలకొల్పనునట్లు తెలిపింది. మైక్రాన్ దేశంలో తొలి సెమీకండక్టర్ తయారీ సంస్థగా రికార్డ్ సృష్టించబోతోంది.
కేంద్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తం పెట్టుబడి 2.75 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 22,159 కోట్లు). ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం గుజరాత్ ప్రభుత్వం నిధులను సమకూర్చనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ుముందు ఈ ప్రాజెక్టుకు భారత్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లో కొత్త సౌకర్యాల నిర్మాణం 2023లో ప్రారంభమవుతుందని మరియు ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ 2024 చివరిలో అమలులోకి వస్తుందని మైక్రాన్ తెలిపింది. ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ దశాబ్దం రెండవ సగంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. రెండు దశలు కలిపి 5,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
దారుణం.. రైళ్లో మహిళపై అత్యాచారయత్నం.. చివరికి..
మహిళల దాడులు రోజూ రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాల ను తీసుకొని వస్తున్నా కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. కదులుతున్న రైళ్లో మహిళ పై అత్యాచారం చెయ్యడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించగా ఆమె ప్రతి ఘటించడంతో ఆ దుర్మార్గులు రైళ్లో నుంచి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణం మహారాష్ట్రలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దారుణం చోటుచేసుకుంది. కదులుతోన్న రైల్లో ఓ మహిళ పై ఐదుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటమే గాకుండా.. ఆమె బంధువు ను బలవంతంగా బయటకు తోసేశారు. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన వారిద్దరిని స్థానిక గ్రామస్థులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ మహిళ తన బంధువుతో కలిసి జార్ఖండ్ నుంచి గుజరాత్ వెళ్లేందుకు సూరత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఈ రైలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో కి చేరగానే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వేధించారు. అనుమతి లేకుండా ఫొటోలు తీశారు. దానికి ఆమె అభ్యంతరం తెలపడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారు ఆమె బంధువుపై దాడి చేశారు..
పాదయాత్రలో సెంచరీ చేసిన భట్టి.. నేడు నకిరేకల్ లో పీపుల్ మార్చ్
కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో సెంచరీ చేసింది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేయనున్నారు.. రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేయనున్నారు భట్టి విక్రమార్క.
తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మండుటెండలో పాదయాత్ర చేస్తుండగా తీవ్ర జ్వరం రావడంతో.. సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరంలో రెండో రోజు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వడదెబ్బతో జ్వరం, నీరసం తగ్గలేదని సమాచారం. డీహైడ్రేషన్ కారణంగానే భట్టి విక్రమార్క అస్వస్థతకు గురయ్యారని సెలైన్స్ ఇక్కించారు. మరోవైపు శిబిరం వద్దకు అస్వస్థతకు గురైన భట్టి విక్రమార్కను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యకారణంగా తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన భట్టి విక్రమార్క. నేటి నుంచి తిరిగి పీపుల్స్ మార్చ్‌ని ప్రారంభించనున్నారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేయవచ్చని డాక్టర్లు సూచించడంతో.. డాక్టర్ల సూచన మేరకు నేటి టినుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు..
నైరుతి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు… ఎల్లో అలర్ట్
తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడె, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ విషయానికొస్తే, హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు – చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, మరియు శేరిలింగంపల్లి – పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. దీనితో పాటు, జూన్ 25 వరకు నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఎక్కువగా ఉంది.నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండే అవకాశం ఉంది.
సముద్రంలో పేలిపోయిన “టైటాన్”.. విధ్వంసానికి కారణం ఇదే..
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శిథిలాలు చూసేందుకు టూరిస్టులను తీసుకెళ్లిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ఆచూకీ లభించింది. టైటానికి సమీపంలోనే దీని శిథిలాలను కనుగొన్నారు. అయితే టైటాన్ మిస్సైన కొద్ది సేపటికే అది పేలిపోయినట్లు యూఎస్ నేవీ గుర్తించింది. అండర్వాటర్ సౌండ్ మానిటరింగ్ పరికరాల ద్వారా టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలినట్లు యుఎస్ నేవీ గుర్తించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది. మ్యూనికేషన్‌లు కోల్పోయినప్పుడు టైటాన్ సబ్‌మెర్సిబుల్ పనిచేస్తున్న సాధారణ పరిసరాల్లో పేలుడు లేదా పేలుడుకు అనుగుణంగా ఉండే అసాధారణతను గుర్తించింది అని అధికారి జర్నల్‌తో చెప్పారు. దాదాపుగా నాలుగు రోజుల వెతుకులాట తర్వాత సముద్రగర్భంలో 3800 మీటర్లు లోతులో టైటాన్ అవశేషాలను యూఎస్ కోస్ట్ గార్డ్ కనుగొంది. టైటాన్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ డౌన్.. వేలాది మందికి నిలిచిన సేవలు..
ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవలే నిలిచిపోయాయి. యూట్యూబ్, యూట్యూబ్ టీవీ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం తెలిపింది. యూట్యూబ్ వేలాది మంది యూజర్లు తమకు సేవలు నిలిచిపోయినట్లు నివేదించారు. 13,000 కంటే ఎక్కువ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు సదరు వెబ్సైట్ తెలిపింది. యూట్యూబ్ టీవీలో అంతరాయం ఏర్పడినట్లు 3000 కంటే ఎక్కువ నివేదికలు వచ్చాయి. ఇటీవల కాలంలో పలు వెబ్ సైట్లు డౌన్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన అనంతరం పలుమార్లు ఇలా సేవలు నిలిచిపోయాయి. ట్విట్టర్ డౌన్ అయింది. కొన్ని నెలల ముందు వాట్సాప్ కూడా ఇలాంటి అంతరాయాన్నే ఎదుర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి సేవలు నిలిచిపోయాయి.
ఇదేం ఆచారం రా స్వామి.. ఊరి బయటే ఆ పనేంటి?
సైన్స్ పెరుగుతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.. అలాంటివి చెయ్యొద్దు అంటున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. ఇప్పుడు ఎందుకు ఇది చెబుతున్నాం అంటే తాజాగా తెలంగాణ లో ఓ ఆచారం ఉంది.. మగవారి కోసం.. ఊరి చివరకు వెళ్లి చీపుర్లు, చెప్పుల తో వాళ్లను వాళ్ళే కొట్టుకుంటారు.. అనంతరం ఆ బట్టలు విప్పేసి అక్కడే పడేసి ఇంటికి వస్తారు.. ఈ ఆచారం తెలంగాణ లోని జగిత్యాల లో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్ మండలం పాత దాంరాజుపల్లిలో గ్రామస్థులు ఏటా చీపుర్లు పట్టుకొని ఒకరినొకరు కొట్టుకుంటారు. అనంతరం గ్రామ శివార్లలోకి వెళ్లి ఆ చీపుర్లను, తాము వేసుకున్న దుస్తులను పడవేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగకూడదని, రోగాల బారిన పడకూడదని కోరుతూ ఏటా ఈ సంప్రదాయాన్ని పాటిస్తామని పాతదాంరాజుపల్లి గ్రామస్థులు చెబుతున్నారు.. అక్కడి వారంతా మొహాలకు రంగులేసుకుని, పాత బట్టలు కట్టుకొని చీపుర్లు చేత పట్టుకుని గ్రామమంతా తిరుగుతారు. అలా ఊరంతా తిరిగిన తర్వాత గ్రామ శివారుకు చేరుకుని పాత బట్టలు, చీపుర్లు అక్కడే పడేసి వస్తారు.