ఏపీలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇటీవల బిపర్ జాయ్ తీవ్ర తుఫాన్ వల్ల స్తంభించిన రుతుపవనాలు మళ్లీ విస్తరించడం మొదలుపెట్టాయి.. ఇక త్వరలోనే తెలంగాణా లో కూడా ప్రవేశినుంచనున్నాయి.. ఈ మేరకు నేడు, రేపు తెలంగాణాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, కామా రెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక రేపు కూడా కొన్ని జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది..
ఇక రేపు వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సోమవారం హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇక రేపు కూడా అదే జిల్లాల్లో కొన్నిచోట్ల తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు..
అదే విధంగా 21వ తేదీ సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్త గూడెం, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీయనున్నాని అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజల కు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బయటకు వెళ్ళినప్పుడు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు..