భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భారత…
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు దిగాయి కార్మిక సంఘాలు. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జాయింట్ ఫోరం ఇంతకుముందే వెల్లడించింది. కార్మక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఈ సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని ఆల్ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అమర్జీత్ కౌర్ తెలిపారు. గ్రామీణప్రాంతాల్లోనూ…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జమ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ నడిపై 1.3 కిలోమీటర్ల మేర 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండబోతున్నది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కిందనుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాలను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోషల్ మీడియాలో…
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు…
ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అదేరోజున రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. గతేడాది రైల్వే బడ్జెట్ 1,10,055 కోట్లు కాగా, ఈ ఏడాది బడ్జెన్‌ను డబుల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైల్వే బడ్జెట్‌కు సంబంధిత మంత్రిత్వశాఖ తుదిమెరుగుతు దిద్దుతున్నది. ఇక ఇదిలా ఉంటే, గతేడాది రైల్వే శాఖకు సుమారు 26,338 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కరోనా కారణంగా వివిధ రైళ్లు ఆగిపోవడంతో ఈ నష్టం సంభవించింది. కాగా,…
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారి కోసం వెస్ట్రన్ రైల్వే వినూత్న పథకం తెరమీదకు తెచ్చింది. డిస్పోజబుల్ బెడ్ రోల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు 150 రూపాయలు చెల్లిస్తే ఈసదుపాయం పొందవచ్చు. ఈ డిస్పోజబుల్ బెడ్ రోల్ ప్యాకేజీలో 7 రకాల వస్తువులు ప్రయాణికులకు లభిస్తాయి.1.డిస్పోజబుల్ బెడ్ షీట్ 12, డిస్పోజబుల్ బ్లాంకెట్ (గ్రే, బ్లూ కలర్)1 డిస్పోజబుల్ పిల్లో కవర్1 డిస్పోజబుల్ పిల్లో డిస్పోజబుల్ బ్లాంకెట్ మూడు…
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పెట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టింది.. క్రమంగా కొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కోవిడ్ సమయంలో రైలు టికెట్ల ధరలు కూడా పెరిగి ప్రయాణికులకు భారంగా మారాయి. అయితే, రైళ్లలో కరోనాకు ముందున్న చార్జీలను అమలుచేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. లాక్‌డౌన్‌లు, కోవిడ్ నిబంధనల కారణంగా రైల్వే శాఖ సర్వీసులను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే కాగా… కొంతకాలంగా స్పెషల్…
పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్‌తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్…
రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్‌ఫారమ్ టికెట్ ధరను సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో నిలిపేసిన ప్లాట్‌ఫారమ్ టికెట్ల జారీ మళ్లీ పునరుద్ధరించారు అధికారులు… జోన్ నెట్‌వర్క్‌లో అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సికింద్రాబాద్ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో…
కరోనా మహమ్మారి విజృంభణతో రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి… ప్రత్యేక రైళ్లు, ఆక్సిజన్ కోసం రైళ్లు తప్పితే.. సాధారణ రైళ్లు పట్టాలెక్కింది లేదు.. కానీ, రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పేసింది దక్షిణ మధ్య రైల్వే.. 82 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్ధమైంది.. 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్ కాగా 66 ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.. ప్యాసింజర్ రైలులో ప్రయాణానికి స్టేషన్‌లోనే టికెట్లు ఇవ్వనున్నారు అధికారులు… ఇక ఈ…