వందే భారత్ వేగంలో మార్పులు జరుగనున్నాయి. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వందే భారత్.. ఇకపై 200 నుంచి 220 కిలో మీటర్లకు పెరగనుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు…
కేరళకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్ సిద్ధమైంది. తిరువనంతపురం-కసర్‌కోట్ వందేభారత్ తిరువనంతపురంలో ఉదయం 5.20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.25 గంటలకు కాసర్‌కోట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాత్రి 10.35 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది.
Railway : రైలులో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారికి ఇష్టమైన సీటు పొందడానికి వారు ఒక నెల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకుంటారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు.
Huge Train: భారతీయ రైల్వే అనేక రికార్డులను నమోదు చేసింది. సాధారణంగానే చాలామందికి రైలుప్రయాణమంటే ఇష్టం. రోడ్డు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే అధికంగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తారు.
Trains Cancelled :రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నిన్నటి నుంచి అంటే ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు.. కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇవాళ విజయవాడ–బిట్రగుంట (07978), విజయవాడ–గూడూరు (07500), ఒంగోలు–విజయవాడ (07576) రైళ్లు రద్దు చేసిన అధికారులు.. ఇక,10, 11 తేదీల్లో…
Indian Railways: 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక రైళ్ల ద్వారా భారీస్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలు, ప్రత్యేక దినాల సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే ఎంత మేరకు ఆర్జిస్తుందన్న విషయంపై చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు గత ఆర్ధిక ఏడాది ప్రత్యేక రైళ్ల ద్వారా భారతీయ రైల్వే రూ.17,526.48 కోట్ల ఆదాయం…
రైల్వే ఉద్యోగులకు పండుగ సమయంలో శుభవార్త చెప్పనుంది కేంద్ర సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. దసరా, దీపావళి ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.. ముఖ్యంగా పలు రంగాల కార్మికులకు ప్రయోజం కలిగేలా నిర్ణయం తీసుకుని.. ఇవాళే ప్రకటన చేయనున్నారు.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం.. ప్రొడక్టివిటీ లింక్‌డ్ బోనస్‌ను (పీఎల్‌బీ) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గం 2021-22…
తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ ఆందోళనకారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు. మూడు…