కొన్ని రోజుల క్రితం ఎయిర్ లైన్స్ మాదిరిగా రైల్వేలలో కూడా అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లలో ప్రయాణించే వారు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉందని, ఏసీ సెకండ్ క్లాస్ ప్రయాణీకులకు, ఈ పరిమితి 50 కిలోలు, థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, పరిమితి 40 కిలోల వరకు ఉంటుంది. అదేవిధంగా, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకులు తమతో 35 కిలోల…
Mahakumbh 2025 : ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే ఆదివారం న్యూఢిల్లీ నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపింది. అలాగే, గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని,
Mahakumbh Mela 2025 : మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. జనసమూహం ఎంతగా ఉందంటే నగరమంతా ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతుంది.
ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ లో ప్రకటించడం లేదన్నారు.. ఇక, రైల్వే…
ఏపీ ప్రజల కలను కేంద్రం నెరవేర్చింది.. పవన్ చొరవతో రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం తెలిపారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో అన్ని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉంటుందన్నారు. మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
భారతీయ రైల్వేలు ప్రైవేటీకరించబడదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరికీ సరసమైన సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. ఇటీవల, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే భవిష్యత్తు గురించి చాలా పెద్ద విషయాలు చెప్పారు.
దేశ వ్యాప్తంగా ఇటీవల రైల్వే ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్వే ప్రయాణాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
India's first bullet train: భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ కారిడార్‌ని రూ. 1.08 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) ఈ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 270 కిలోమీటర్ల గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తైందని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. 270 కి.మీ పొడవునా వైర్ డక్ట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడం…
Komatireddy Venkat Reddy: కేంద్ర రైల్వేశాక మంత్రి అశ్విని వైష్ణవ్ తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై గురించి చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి స్టేషన్ కు ప్రతీరోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారని, అదే విధంగా జనగామ జిల్లాగా ఏర్పడిందని, రోజూ విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారని ఈ రెండు స్టేషన్లను ఆధునీకీకరించాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు.