కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు.
నేడు సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు.
Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రధానమంత్రిని సంయుక్తంగా ప్రకటిస్తామని ఈ రోజు అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీకి…
Rahul Gandhi on INDIA Alliance PM Candidate: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పీ చిదంబరం తదితరులు ‘న్యాయ్ పత్ర’ పేరుతో శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను ప్రకటించారు. మేనిఫెస్టో రిలీజ్ అనంతరం రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొనగా.. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న…
ఈసారి అమేథీలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారంటూ దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపింది. రాహుల్ గాంధీనే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. తీరా.. కాంగ్రెస్ తొలి జాబితా వెలువడగానే ఆ ఉత్కంఠ వీడిపోయింది.
దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.