Election Phase 2: శుక్రవారం దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయి. ఇప్పటికే ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా 102 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. రేపు రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
శుక్రవారం జరిగే రెండో విడత పోలింగ్‌లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర 08, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, అస్సాం, బీహార్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో రాష్ట్రంలో 03 స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో సీటుకి ఎన్నికలు జరగనున్నాయి.
Read Also: Muslim Quota: ముస్లిం కోటా వివాదం.. ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఫైర్..
ఈ దశలో కీలక వ్యక్తులు బరిలో ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా మరోసారి పోటీలో ఉన్నారు. బీజేపీకి చెందిన సురేంద్రన్, సీపీఐకి చెందిన అన్నీరాజాతో పోటీ పడుతున్నారు. తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ మథుర నియోజకవర్గం నుంచి హేమామాలిని బరిలో ఉన్నారు. కోటా నుంచి ఓంబిర్లా పోటీలో ఉన్నారు. కేంద్రమంత్రి షెకావత్ జోధ్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు.
బెంగళూర్ సౌత్ నుంచి బీజేపీ తరుపున తేజస్వీ సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలబపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ బీజేపీ కంచుకోట రాజ్‌నంద్‌గావ్ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ నేత సంతోష్ పాండేతో బఘేల్ పోటీ పడుతున్నారు. రామయాణ్ టీవీ సీరియన్ ఫేమ్ శ్రీరాముడి పాత్రని పోషించింది అరుణ్ గోవిల్ మీరట్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత కేసీ వేణుగోపాల్ కేరళ అలప్పుజ సీటు నుంచి పోటీ చేశారు. త్రిస్సూర్ నుంచి బీజేపీ నేత, మళయాళ నటుడు సురేష్ గోపి పోటీలో ఉన్నారు.