నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోడీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.
నీట్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పేపర్ లీకేజ్‌పై చర్చ జరపాలని శుక్రవారం విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.
ప్రతిపక్షాలు మాత్రం ‘నీట్’ అవకతవకలపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ నీట్ వ్యవహారంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ నేత మానిక్క ఠాగూర్ ఈ తీర్మానాన్ని ఇచ్చారు. పరీక్షా నిర్వహణలో ఎన్టీఏ విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూలై 2వ తేదీన వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశించింది.
ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడిన.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
Leader Of Opposition: 10 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత వచ్చారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంది. సాధారణంగా లోక్‌సభలోని మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు.
చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53…
Parliament: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాతో కరచాలనం చేసి అభినందనలు తెలిపారు.
Rahul Gandhi: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ రోజు జరిగిన స్పీకర్ ఎన్నికల్లో మూజువాణి ఓటులో ఓం బిర్లా గెలుపొందారు
లోక్‌సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ప్రమోషన్ లభించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.