సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్‌సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు.…
పాకిస్థాన్‌లో కలకలం రేపుతున్న కాంగో వైరస్.. పాకిస్థాన్‌లో కాంగో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. క్వెట్టా నుంచి తాజాగా మరో కొత్త కాంగో వైరస్ కేసు నమోదైంది. 32 ఏళ్ల రోగి ఫాతిమా జిన్నా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. ఇప్పుడు వైద్య సంరక్షణలో ఉన్నారు. పాక్ కి చెందిన ఓ న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోగి పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కిలా సైఫుల్లా జిల్లా కిలా సైఫుల్లా నగరంలో నివాసి అని ఆసుపత్రి వర్గాలు…
Rahul Gandhi : కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఈ సమాచారాన్ని అందించారు.
చెట్టును ఢీకొన్న ఆర్డీసీ బస్సు.. 25 మందికి గాయాలు మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్‌పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణె జిల్లాలో చెట్టును ఢీకొనడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పంఢర్‌పూర్…
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టిన తర్వాత తొలిసారిగా ఆ ప్రాంత ప్రజలకు లేఖ రాశారు. జూన్ 18న కేరళలోని ఈ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు.
Kallakurichi hooch tragedy: తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 50 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Rahul Gandhi : నీట్-పీజీ పరీక్ష వాయిదా తర్వాత శనివారం ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల అసమర్థత వల్ల పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.