కాంగ్రెస్ కొత్త సారథిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న స సోనియా గాంధీ నుంచి ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మల్లికార్జున్ ఖర్గే.. నేడు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికైన విషయం విధితమే. ప్రత్యర్థి అభ్యర్థి శశిథరూర్పై 84శాతం ఓట్ల తేడాతో ఖర్గే విజయం సాధించారు.
భారత్ ను ఒకటి చేద్దాం అనే నినాదంతో పాదయాత్రకు రంగం సిద్ధం చేసింది కాంగ్రెస్. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ స్వయంగా పాదయాత్రకు పూనుకోవడం పార్టీకి బూస్ట్ ఇస్తుందనే అంచనాలుపెరిగాయి. సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలైంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు…
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ముగించుకుని.. మరోసారి కర్ణాటకలో అడుగుపెట్టబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తుంగభద్ర డ్యామ్ మధ్యలో ఏపీ సరిహద్దు ముగిసి.. కర్ణాటక సరిహద్దులోకి ప్రవేశించనున్నారు రాహుల్ గాంధీ