ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది.
Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్ణాటకలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలో అడుగుపెట్టిన రాహుల్గాంధీకి రాష్ట్ర సరిహద్దులోని గుండ్లుపేట్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 18వ రోజు విజయవంతంగా సాగుతోంది. భారత్ జోడో యాత్రలో పలుమార్లు ఉద్విగ్న సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి.
తన సొంత గడ్డపై సమస్య తలెత్తడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని పలు వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.