K. Laxman: నలుగురు ఎమ్మెల్యేలు నీతిమంతులైతే ప్రగతి భవన్ లో ఎందుకు దాచిపెట్టినట్టని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. నిన్న కేసీఆర్ సభపెట్టి పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణ తప్ప అందులో ఏమి లేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు. ప్రధాని మోడీ మీద అరిగిపోయిన టేపు రికార్డ్ లా మాట్లాడారని ఎద్దేవ చేశారు. ఎనిమిది ఏళ్ళుగా రాష్ట్రానికి ఏమీ చేయనిది కొత్తగా ఎదో చేస్తానని చెప్తున్నారు. కొత్తగ ఎదో చేస్తానన్నారు అంటే ఈ ఎనిమిది ఏళ్లలో ఏమీ చేయలేదు అనే అర్థం కదా అంటూ ఎద్దేవ చేశారు. చేనేత మీద 5 శాతం gst కి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతకం చేసింది నిజం కాదా? 20 లక్షల టర్నోవర్ మీద పన్ను కోరుకుంది మీరూ కాదా? నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉంటే మీ 2.5% వడులుకోవచ్చు కదా?గీతా కార్మికులకు 10 లక్షల గీతా బందు ఎందుకు ఇవ్వవు? అని ప్రశ్నలు గుప్పించారు. మునుగోడు లో ఎనిమిది ఏళ్లలో అదనంగా ఒక్క గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు. దేశం మొత్తం 50 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టేందుకు దేశ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు అంశం ఒక పెద్ద నాటకం, ఆ నాటకంలో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
Read also: Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు హీరోలని, నీతి కలిగిన వ్యక్తులని కేసీఆర్ చెప్పడం దురద్రుష్టకరమన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నీతివంతమైన వ్యక్తులు అయితే ప్రగతి భవన్లో ఎందుకు దాచిపెట్టినట్టు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ నైతిక విలువలకు కట్టుబడి ఉందని అన్నారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మా పార్టీకి లేదన్నారు. కేసీఆర్ పాలనలో తప్పులు లేకపోతే సీబీఐని ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నాడని మండిపడ్డారు. దొడ్డిదారిన సీబీఐకి వ్యతిరేకంగా ఎందుకు జీవో తీసుకువచ్చారని తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మోడీ ప్రధానమంత్రి కావడం కేసీఆర్ కు మింగుడు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పుడు విధానాల వల్ల తెలంగాణలో విద్యుత్ డిస్కంలో నష్టాల్లో ఉన్నాయి, అవి కప్పిపుచ్చేందుకే కేంద్రం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. మీటర్లు పెట్టే ఆలోచన బీజేపీకి లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఉంటే రైతుల పక్షాన మేమే ఉద్యమిస్తామన్నారు. మునుగోడు అభివృద్ది కావాలన్న రాజా గోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. రాహుల్ ది కాంగ్రెస్ టీఆరెఎస్ జోడో యాత్రా అని అడిగారు. ఒక్కటిగా ఉండాల్సిన దేశం మూడు ముక్కలు అవ్వడానికి కారణం ఎవరూ ? రాహుల్ చెప్పాలని తెలిపారు. పాకిస్తాన్ ను పక్కెల్లో బల్లెంల చేసింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్‌ఎస్ కే వేసినట్టు అని అన్నారు. మోడీని బీజేపినీ ఎదుర్కోడానికి గుంపులుగా వస్తున్నాయని తెలిపారు.
Konda Surekha: పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదు