రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఉదయం రాహుల్ పాదయాత్ర శంషాబాద్ లో ప్రారంభం అయింది. టీ బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమైంది రాహుల్ పాదయాత్ర… రోడ్డుపై రాహుల్ గాంధీ ముందు కరాటే ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేతలు, వివిధ వర్గాల ప్రజలు. అందరికీ అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు.
అందరితో మమేకం అవుతూ…. రాహుల్ ముందుకు సాగుతున్నారు. వృద్ధుల్ని ఓదారుస్తూ.. యువకులతో కలిసి ఆడుతూ పాడుతూ రాహుల్ కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఇందిరమ్మ మనవడు తనను హత్తుకోవడం ఆ అవ్వ ఎంత హ్యాపీగా ఫీలవుతుందో చూడండి.