137 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించడం ఇది ఆరోసారి. 24 సంవత్సరాల అనంతరం తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య గట్టి పోటీ నెలకొననున్న సంగతి తెలిసిందే. భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో బళ్లారిలో రాహుల్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు.
భారత్ జోడో యాత్రలో అపశ్రుతి తలెత్తింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి జిల్లా న్యూమోకా గ్రామంలో కొనసాగుతుండగా.. ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్తంభానికి జెండాలు కడుతుండగా ఐదుగురు కరెంట్ షాక్కు గురయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశథరూర్కు మధ్య గట్టి పోటీ జరగనుంది.
Rahul Gandhi criticizes BJP and RSS: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బళ్లారిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని అన్నారు. బీజేపీ దేశంలోని ప్రజలను విడదీస్తుందని చాలా మంది ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ యాత్రకు ‘ భారత్ జోడో యాత్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్…
Bharat Jodo Yatra To Complete 1000 Km Tomorrow: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం జరిగే రాహుల్ గాంధీ 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకుంటుంది. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయింది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తై ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి చేరుకుంది. శనివారం కర్ణాటకలో బళ్లారి జిల్లాకు చేరుకోవడంతో పాదయాత్ర 1000 కిలోమీటర్లను…
Rahul Gandhi Questions PM Modi Over High Inflation, Unemployment: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ద్రవ్యోల్భనం 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది..? నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరింది..?
కర్ణాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్ జోడోయాత్ర కొనసాగింది.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు. ఇక, త్వరలోనే తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టబోతున్నారు.. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారుపై సుదీర్ఘ కసరత్తు చేసింది తెలంగాణ కాంగ్రెస్.. ముందుగా అనుకున్న…