భారత్ జోడో యాత్ర పేరటి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణ సాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు ఆరో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతున్న క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళిగా రాహుల్ గాంధీ మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోడీ హయాంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన సంస్థలను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Also Read : High Court : జూబ్లీహిల్స్ పబ్‌లలో రాత్రి 10 తర్వాత నో మ్యూజిక్.. తేల్చి చెప్పిన హైకోర్టు
ఫిట్ నెస్ కోసమే అయితే జిమ్ కి పోతే ఇంకా లాభమని, విద్వేష రాజకీయాలపై ఈ జోడో యాత్ర అని.. లక్షల మంది నాతో నడుస్తున్నారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి..? అని ఆయన ప్రశ్నించారు. దాని మీద చర్చ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండూ (బీజేపీ, టీఆర్ఎస్) పార్టీలు దోచుకుని పనిలో ఉన్నాయంటూ ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్‌తో ఎలాంటి మిత్రుత్వం ఉండదని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ.. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టొచ్చు.. చైనాలో కూడా పోటీ చేయొచ్చు అంటూ వ్యాఖ్యానించారు.
Also Read : Rahul Gandhi: కేసీఆర్ జాతీయ పార్టీపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పొత్తుపై కూడా తేల్చేశారు..
ఓబీసీ సెన్సెస్‌కి కాంగ్రెస్ కి కట్టుబడి ఉందని, నేను వ్యక్తిగతంగా స్పష్టతతో ఉన్నానని, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అన్నిటినీ చర్చ చేస్తారు అని ఆయన తెలిపారు. నాకు 25 ఏండ్లు ఉన్నప్పుడు దేశం అంత తిరగాలి అనుకున్నానని, అప్పుడు రాజకీయాల్లో లేనని,
నడవాలి అని నేను అనుకున్ననా… కాంగ్రెస్ పార్టీ అనుకున్నదా అనేది తెలియదని, పాదయాత్రతో చాలా నేర్చుకుంటున్నానని ఆయన వెల్లడించారు. చార్మినార్ నుండి రాజీవ్ గాంధీ యాత్ర చేశారని, అక్కడి నుండి జొడో యాత్ర చేస్తున్నామన్నారు.
గుజరాత్ ప్రమాదంపై రాజకీయాలు మాట్లాడనని, అక్కడ ప్రజలు చనిపోయారని, దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. మా పార్టీ అధ్యక్డడు ఖర్గే.. ఆయన నన్ను ఏం చేయమంటే అది చేస్తానని, ప్రస్తుతం నేను యాత్రలో ఎవరిని కలవాలి.. ఎవరితో మాట్లాడాలి అనేదే చూస్తున్నానని, కశ్మీర్ వెళ్లిన తరువాత నేనేం అనుకుంటున్న అనేది చెప్తానన్నారు. ప్రజలు కాంగ్రెస్‌తో బ్రేక్ కాలేదని, ప్రజలతో కనెక్ట్ కావడానికి యాత్ర చేస్తున్నామన్నారు. ప్రతి పక్షాలది విద్వేషం కాదు.. వాళ్లకు భయమన్నారు రాహుల్ గాంధీ.