కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు.
ఢిల్లీలోని లుటియన్స్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి జన్పథ్లోని నివాసంలో కొంతకాలం ఉంటారు. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని అధికారులు కోరారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం తన అధికారిక నివాసం నుండి తన వస్తువులన్నింటినీ తరలించారు. ఎంపీగా తనకు కేటాయించిన బంగ్లా నుంచి గాంధీ శుక్రవారం సాయంత్రం తన మిగిలిన వస్తువులను తరలించినట్లు వర్గాలు తెలిపాయి.
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పింది చేస్తాడు అని అందరికీ తెలుసు.. అయితే ట్విట్టర్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాడు.. ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్నాడు. అయితే నిన్నటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు.
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసిన పెద్దగా ఆందోళన చెందడం లేదు. గురువారం రాహుల్ గాంధీ ఢిల్లీలో హల్ చల్ చేశారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో విద్యార్థులతో సమావేశమయ్యారు.
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. భారతదేశంలో రాజ్యాంగం విజయం సాధిస్తుందని, రాజవంశ రాజకీయాలు కాదని తీర్పు స్పష్టం చేసిందని ఆ పార్టీ పేర్కొంది.
పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన పిటిషన్పై సూరత్ కోర్టు నేడు తన తీర్పును ప్రకటించనుంది.
బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదు అని అంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నుంచి దేశానికి నష్టం అని భావించే... BRS పార్టీని ఏర్పాటు చేశాడు అని చాడ వెంకటరెడ్డి అన్నాడు.
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు.