కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆధారంగా రాహుల్ గాంధీ లోక్సభకు అనర్హత వేటు వేయడంపై పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్షాలను ప్రజలు క్షమించరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పేర్కొన్నారు. కౌశాంబి మహోత్సవ్ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల సర్వతోముఖ సంక్షేమం కోసం 2024లో మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
పాటియాలా కోర్టు నుంచి ఇటీవలే విడుదలైన మాజీ క్రికెటర్, పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నవజ్యోత్ సిద్ధూ రాహుల్ గాంధీని కలిసారు. 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సిద్ధూ ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. పంజాబ్ కోసం పని చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ద్రోహి భావజాలం కలిగి ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. దేశానికి వ్యవతిరేకంగా పని చేయడమే ఆ పార్టీ ఒక పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల శిక్షపై అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు గుజరాత్ కోర్టుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు.
బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు.
Rahul Gandhi: మోదీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు నేడు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులను సంప్రదించి ఇప్పటికే ఆయన వ్యాజ్యం తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనుంది. ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు.
S Jaishankar:పాశ్యాత్య దేశాలకు మరోసారి తలంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్న సమయంలో వారికి సరైన పాఠం నేర్పారు జైశంకర్. ఇదిలా ఉంటే మరోసారి పాశ్చాత్య దేశాల వైఖరిని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో పలు విదేశాలు స్పందించడంపై ‘‘ బ్యాడ్ హ్యాబిట్’’ అంటూ ఘాటుగా స్పందించారు.
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్…
Navjot Sidhu: 34 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ 10 నెలల తర్వాత ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే బీజేపీ, ప్రధాని మోదీ టార్గెట్ గా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ప్రజాస్వామ్యం సంకెళ్లలో ఉందని అంటూ విమర్శించారు. పంజాబ్ దేశానికి రక్షణ కవచం, ఈ దేశంలో నియంతృత్వం వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీ నేతృత్వంలో విప్లవం వచ్చింది అంటూ సిద్ధూ…