ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమావేశం కానున్నారు. రేపు అనుచరుల సమావేశంలో పార్టీ మార్పుపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు అధికారికంగా స్పష్టం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా పొంగులేటితో నేరుగా టచ్‌లో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనకు కబురు పంపడంతోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే అదే రోజు రాహుల్‌గాంధీ సమక్షంలో పొంగులేటి బృందం కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉందని సమాచారం.
Also Read : Bihar: పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు
పార్టీలో చేరిన అనంతరం ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ప్రణాళిక ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే పొంగులేటి బృందం కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైనా.. తనతోపాటు కాంగ్రెస్ కండువా కప్పుకొనే వారికి కచ్చితంగా టికెట్ హామీ ఇప్పించేందుకు, అందుకు అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చలు కొలిక్కి వచ్చినట్లు, దీంతో అధిష్ఠానాన్ని కలిసేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది.
Also Read : Bihar: పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు