‘వీర్ సావర్కర్’ సినిమాకి ఎండ్ కార్డ్…
‘వీర్ సావర్కర్’ కథతో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌజ్’తో పాటు బాలీవుడ్ మరో సినిమా కూడా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యాక్టర్స్ లో రణదీప్ హుడా ఒకరు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న రణదీప్ హుడా మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’. ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ ఇటీవలే ‘వీర్ సావర్కర్ 140వ జయంతి’ నాడు రిలీజ్ చేసారు.
భగత్ సింగ్, కుదిరామ్ బోస్ లాంటి లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ నే ప్రేరేపించిన గొప్ప నాయకుడు సావర్కర్. అలాంటి నాయకుడి కథని ఎవరు చంపేశారు? ఎందుకు చంపేసారు అంటూ రణదీప్ హుడా ‘సావర్కర్’ టీజర్ ని సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. టీజర్ లో రణదీప్ హుడా ‘సావర్కర్’ పాత్ర కోసం పడిన కష్టం కనిపిస్తోంది. టీజర్ తో అంచనాలు పెంచిన రణదీప్ హుడా, వీర్ సావర్కర్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసాడు.
డీకే శివకుమార్ తో కోమటిరెడ్డి భేటీ.. కర్ణాటక చేరిన టీ కాంగ్రెస్ రాజ’కీ’యం
కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ రాజకీయం బెంగళూరుకు మళ్ళింది. గత కొంత కాలంగా పార్టీలో సైలెంట్ గా ఉన్న స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పార్టీలో యాక్టివ్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. ఇటీవల బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ కర్ణాటకలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ గెలుపు కోసం ఆయన సేవలను కొంతైనా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డీకే శివకుమార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీని కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఆసియా కప్ 2023.. మాట మార్చిన పీసీబీ కొత్త ఛైర్మన్!
ఆసియా కప్ 2023 టోర్నీ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కొత్త ఛైర్మన్ జకా అష్రాఫ్ తన మాటలను భలేగా మారుస్తున్నాడు. 2023 ఆసియా కప్ నిర్వహణ కోసం మాజీ పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించేది లేదని చెప్పిన జకా అష్రాఫ్.. 24 గంటలు గడవకముందే తన మాట మార్చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం మేరకు ముందుకు వెళ్తానని తాజాగా ప్రకటించాడు. ఆసియా కప్ మ్యాచ్‌ల నిర్వహణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. దీంతో ఆసియా కప్ నిర్వహణపై కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది.
‘హైబ్రిడ్ మోడల్‌ను నేను వ్యతిరేకించా. దేనివల్ల పాకిస్తాన్ క్రికెట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదని నేను భావిస్తున్నా. అందుకే హైబ్రిడ్ మోడల్ నాకిష్టం లేదు. అతిథ్య దేశంగా టోర్నీ నిర్వహణ ద్వారా పాకిస్థాన్‌కు ప్రయోజనాలు దక్కాలి. శ్రీలంకకు ఎక్కువ మ్యాచ్‌లను కేటాయించడం నాకు నచ్చలేదు. అయితే టోర్నీ నిర్వహణలో ఏసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఏసీసీ ప్రకారమే ముందుకు వెళ్తాం. ఏసీసీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. ఇప్పటినుంచి అయినా మేం మా దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం ఉండేలా చూసుకుంటాం’ అని జకా అష్రాఫ్ చెప్పినట్టు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.
విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. పాకిస్తాన్ టైకూన్ “టైటాన్”కు బలైయ్యాడు
అట్లాంటిక్ సముద్రంలో మునిపోయిన టైటానిక్ షిప్ ను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయలుదేరిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది. సముద్రం అడుగు భాగంలో 4 కిలోమీటర్ల లోతులో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తానీ బిజినెస్‌మ్యాన్ కూడా చనిపోయాడు. పాకిస్తానీ – బ్రిటిష్ ధనవంతుడు షాహజాదా దావూద్, అతని కుమారుడు 19 ఏళ్ల సులేమాన్ దావూద్ మరణించిన ఐదుగురిలో ఉన్నారు.
తీవ్ర ఒత్తడి కారణంగా టైటాన్ పేలిపోయి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన శిథిలాలను యూఎస్ కోస్ట్ గార్డ్ కనుగొంది. కమ్యూనికేషన్ కట్ అయిన కొద్ది సేపటికే సముద్రం లోపలి నుంచి పేలుడు శబ్ధాన్ని విన్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే షహజాదా దావూద్ మాత్రం విధిని తప్పించుకోలేకపోయాడు. 2019లో షహజాదా ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదాన్ని తృటితో తప్పించుకుంది. ఆ సమయంలో షహజాదా చావు నోట్లో వరకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం షహజాదా భార్య క్రిష్టిన్ దావూద్ ఆ భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు.
నెటిజెన్ అడిగిన ఆ ప్రశ్నకు సింపుల్ గా స్పందించిన శృతి హాసన్..
ఇండస్ట్రీ లో ఎంతటి స్టార్ ల బాక్గ్రౌండ్ వున్న కానీ టాలెంట్ కనుక లేకపోతే ప్రేక్షకులు ఆదరించరు. టాలెంట్ ఉంటే ఎలాంటి బాక్గ్రౌండ్ అవసరం లేదు. ప్రేక్షకులు వారికి తిరుగులేని విజయాన్ని అందిస్తారు.. అలాంటి వారిలో శృతి హాసన్ కూడా ఒకరు. విశ్వ నటుడు కమల్ హాసన కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతిహానస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందుకు పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది శృతి.ఆ తర్వాత అనగనగ ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది శృతి. కానీ ఆ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు. ఆతర్వాత ఆమెకు పవర్ స్టార్ గబ్బర్ సింగ్ తో భారీ హిట్ లభించింది.ఆ సినిమా తరువాత ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి.
సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు మాంగనీసు, నది ఇసుక గనుల లీజు పొడిగించాలన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు సంబంధించి పలు దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్ కు అవసరమైన మాంగనీసు, నది ఇసుక బయట నుండి కొనుగోలు చేయడం తీవ్ర ఆర్థిక భారమన్నారు సీపీఐ రామకృష్ణ. విజయనగరంలో ఉన్న మాంగనీసు గనుల లీజు పొడిగించాలని, అనకాపల్లి జిల్లా కింటాడ క్వార్ట్జ్ గనులు, విజయనగరం జిల్లా సారిపల్లి ఇసుక గనుల లీజును పునరుద్ధరించాలన్నారు.
పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
కొన్నేళ్లుగా భక్తి పేరిట మభ్యపెట్టి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో.. వచ్చే నెల 5వ తేదీ వరకు పూర్ణానంద స్వామికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే.. పూర్ణనంద రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు చెప్పారు దిశ పోలీసులు. రిమాండ్ రిపోర్ట్‌లో.. అర్ధ రాత్రి మైనర్ బాలిక లని నిద్ర లేపి తన గదికి తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసే వాడు అని, స్వామీజీ ఏడాది కాలంగా అత్యాచారం చేయడంతో మరో మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు దిశ డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఇద్దరు మైనర్ బాలికల పై అత్యాచారం చేసినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించాయని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న దిశ పోలీసులు.. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో వారి బంధువులు ఆ బాలిక ను ఆశ్రమం నుంచి తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు.
మరో మహిళతో భర్త.. ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టి భార్య ఆత్మహత్య
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. పెళ్లయిన భార్య, భర్తలు వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. సామాన్య ప్రజలే కాదు సమాజంలో ఉన్నంత స్థాయి వారు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అదిచూసి భరించలేని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో నాచారంలో కలకలం రేపుతుంది.
హైదరాబాద్ నాచారంలో సనా అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓ కంపెనీ విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం తనకు నాచారంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త వేరొక మహిళతో వివాహేత సంబంది కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమె సహించలేకపోయింది. ఈ విషయమై భర్తకు చెప్పిన వినిపించుకోలేదు. ఈ క్రమంలో సన, ఆమె భర్తల మధ్య విబేధాలు కొనసాగాయి. వేరే మహిళతో ఉండటం సహించలేని సన ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైంది. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. సనా ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సనా ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గేమ్ చేంజర్ టీజర్ విడుదలకి రంగం సిద్ధం…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఈ స్టూడెంట్ రోల్ కి ఇంకో షేడ్ ఉన్నట్లు సమాచారం. సినిమాకి ప్రాణంగా నిలిచే ‘ఎన్నికల అధికారి’గా రామ్ చరణ్ కనిపించేది.. ఈ స్టూడెంట్ లీడర్ తర్వాత వచ్చే చేంజ్ ఓవర్ లోనే. భారి బడ్జట్ తో, శంకర్ మార్క్ సోషల్ కాజ్ టచ్ తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది.
రాహుల్ గాంధీ రియల్ “దేవదాస్”.. బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ రోజు పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని విపక్షాల భారీ స్థాయిలో సమావేశం జరుగబోతోంది. అయితే పాట్నాలో బీహార్ బీజేపీ మాత్రం రాహుల్ గాంధీకి విచిత్రమైన స్వాగతం పలికింది. పాట్నాలోని బీజేపీ కార్యాలయం ముందు రాహుల్ గాంధీ ‘రియల్ దేవదాస్’ అంటూ ప్లెక్లీని ఏర్పాటు చేసింది. ‘‘ కాంగ్రెస్ బెంగాల్ వదలాల్సిందిగా మమతా బెనర్జీ, ఢిల్లీ-పంజాబ్ వదలాల్సిందిగా కేజ్రీవాల్, బీహార్ వదిలిపెట్టాలని లాలూ-నితీష్, యూపీ వదలాల్సిందిగా అఖిలేష్ యాదవ్, తమిళనాడు విడిచిపెట్టాలని స్టాలిన్ కోరుతున్నారు. కాంగ్రెస్ ని రాజకీయాల నుంచి తప్పుకోవాలని అందరూ అడిగే రోజు ఎంతో దూరంలో లేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రీల్ దేవదాసు షారుఖ్ ఖాన్ అయితే.. రియల్ దేవదాస్ రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు.