తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా వచ్చే నెల 2వ తారీఖున ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రెండు నెలలుగా హింసాకాండలో దగ్ధమైంది. రెండు నెలల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 29 నుండి 30 వరకు మణిపూర్ పర్యటించనున్నారు.
శుక్రవారం బీహార్లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు.
Opposition meet: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గద్దె దించడమే ప్రధాన ధ్యేయంగా గురువారం ప్రతిపక్షాలు పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశమయ్యాయి.
Manipur Violence: నెల రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితి చక్కబడటం లేదు.
Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Top Headlines @1PM 23.06.2023, Top Headlines @1PM, Telugu news, big news, rahul gandhi, cm jagan, ram charan, game changer, purnananda swamy, shruti haasan