పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇవాళ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ పిల్లగాడు ఆయనకు ఏం తెలవదంటూ వ్యాఖ్యానించారు. వరంగల్ సభలో 4వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశాడని, నాలుగు వేల పెన్షన్ ఇస్తే సంతోషమే కానీ వారు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు… అక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం 600 పెన్షన్ ఇస్తూ.. ఇక్కడ 4000 పెన్షన్ ఇస్తామని బద్మాష్ మాటలు ఎందుకు అంటూ ఆయన విమర్శించారు. ఇలా మాట్లాడడం ఓట్ల కోసం అధికారం కోసం ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Venu Yeldandi : స్టార్ హీరోతో సినిమా చేయాలనీ ఉంది అంటున్న వేణు..?
అనంతరం గోపులాపూర్‌లో రూ.70 లక్షలతో పద్మశాలీ సంఘ భవనం, మాల సంఘ భవన నిర్మాణాలకు ప్రొసీడింగ్స్ అందజేశారు. యశ్వంతరావ్‌పేటలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, రూ.5 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. రూ.10 లక్షలతో మాదిగ, కురుమ సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన యాదవ సంఘం కులస్థులు పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు గ్రామాలకు వెళ్లాలంటే ముండ్ల పొదలు, చెట్ల కుప్పలు, మురుగునీటిని దాటుకొని పోయేవాళ్లమని, మురుగునీరంతా ఇండ్ల ముందు పారుతుండేదని గుర్తుచేశారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదన్నారు.
Also Read : Uddhav Thackeray: ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు..