Ponguleti Srinivas Reddy : రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్ కు లేదని, రాహుల్ గాంధీనీ అనేముందు .. కేటీఆర్ కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలన్నారు. ఒక వేలు రాహుల్ గాంధీ వైపు చూపిస్తే .. నాలుగు వెళ్ళు మీ వైపు చూపుతున్నాయని తెలుసుకోవాలని హితవు పలికారు పొంగులేటి.
Also Read : Varshini : ఫారెన్ వీధుల్లో పొట్టి షాట్‌లో పరేషాన్ చేస్తున్న యాంకర్ వర్షిణి..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కేటీఆర్ రాహుల్ గాంధీపై విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి అపారమైన విషయ పరిజ్ఞానం ఉందని, భారత్ జోడో పాదయాత్రలో దేశంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారని ఆయన వెల్లడించారు. మీ ఫామ్ హౌస్ లో క్యాప్సికమ్ పంటకు కోట్లు సంపాదించా మని చెప్పిన మీరు .. మరి రాష్ట్రంలో రైతులకు ఆ ఫార్ములా ఏంటి ఎందుకు చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Vemula Prashanth Reddy : ఎంపీకి కనీస అవగాహన లేదు
రాహుల్ పై విమర్శలు చేసే కేటీఆర్ ఏనాడైనా పాదయాత్ర చేశాడా అని ప్రశ్నించారు. మీకు అధికారం.. మంత్రి పదవి సోనియా గాంధీ పెట్టిన భిక్ష అని ఆయన అన్నారు. కేసీఆర్ ఓ మాయల మరాఠీ అని, ఉచిత విద్యుత్ కాంగ్రెస్ కే పేటెంట్ హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ పై బీఆర్ఎస్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదని, వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను వక్రీకరించి పబ్బం గడుపుకోవాలని కేటీఆర్ చూస్తున్నారని ఆయన అన్నారు.
Also Read : Movies Releasing this week: ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలివే!
నాకు ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి ఇచ్చినందుకు అధిష్టానంకు రాష్ట్ర పీసీసీ, సీఎల్పీ సహా ముఖ్య నేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని పనిచేస్తామని, సీనియర్ల సలహా లు సూచనలతో ముందుకు వెళతానన్నారు. పార్టీ ఏ గీత గీస్తే దాన్ని శిరసావహిస్తానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!