కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని మల్లు రవి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై అణిచివేతకి నిరసనగా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు.. తెలంగాణలో కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Read Also: Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ద్వారా దేశం ఐకమత్యంగా ఉండాలని పాదయాత్ర చేశారు.. 4, 500 కిలోమీటర్లు నడిచారు.. రాహుల్ గాంధీ భావి ప్రధానిగా ఉంటే మంచిదని ప్రజలు భావిస్తున్నారు అని మల్లు రవి కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బతీయడానికి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీని చిన్న మాట అన్నందుకు ఇప్పుడు వేదిస్తున్నారు.. చిన్న కేసును పెద్దగా చేసి ప్రభుత్వం అండగా నిలబడి అణిచివేయాలని చూస్తున్నారు అంటూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
Read Also: AP Women Commission: పవన్‌పై మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు..
దేశంలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుంది.. కమలం పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు మల్లు రవి పిలుపునిచ్చారు. మోడీ గురించి ఒక్క మాట మాట్లాడినందుకు రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి.. ఇళ్లు ఖాళీ చేయించి.. భద్రతను తగ్గించి.. హైకోర్టుకు పోయినా స్టే ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ నెల 12న జరుగనున్న సత్యాగ్రహ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.