MLA Sandra Venkata Veeraiah Fires On Revanth Reddy Comments: రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సబ్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో బిఅర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటనతో, గతంలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ బూటకమని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండకుండా విద్యుత్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల చేత తిరస్కరించబడిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న తరుణంలో మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అవగాహన లేని నాయకులు ఉచిత విద్యుత్‌పై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని దుయ్యబట్టారు.
Chandrayaan-3: వైఫల్యమే విజయానికి సోపానం.. చంద్రయాన్-2 ఫెయిల్యూర్‌కి కారణాలు ఇవే..
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యువజన విభాగం నాయకులు నియోజకవర్గంలోని ప్రతి గడపకు తీసుకెళ్లి.. ప్రతిపక్షాల అసత్య ప్రచారాల్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే సండ్ర పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందని, నేటి యువత బీఆర్ఎస్ వైపు చూస్తోందని అన్నారు. ఇదే సమయంలో.. సత్తుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు అనుమతులను జారీ చేస్తూ, తదుపరి చర్యలను టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు చేపట్టాలని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసినట్లు సండ్ర తెలిపారు. దీని వల్ల.. అందరికీ పాలిటెక్నిక్ విద్య అందుతుందని, ఇంజనీరింగ్ విద్యా అవకాశాలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో పాటు కోర్సులు, సిబ్బంది, ఇతర సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.
BS Rao: శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత