రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి సీనియర్ ఖండిస్తున్నట్లు తెలిపారు. మోడీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలను సైతం ఈడీ, సీబీఐ పేరుతో అణిచివేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 ఏళ్ల స్వతంత్ర ఫలాలను దేశ ప్రజలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని పేర్కొన్నారు. మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్…
ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కో-ఆర్డినేటర్లు పార్టీకి కళ్లు, చెవులు లాంటివారని అన్నారు. మైక్రో లెవల్ లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పరిశీలించాలని తెలిపారు.…
తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని చెప్పారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా, లోక్ సభ ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలువాలని చూస్తోంది. ఈ క్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా పాటుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ మంత్రులు కొందరు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.
మణిపూర్ నుంచి జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ మణిపూర్ సర్కార్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టబోతున్న ‘భారత్ న్యాయ యాత్ర’పై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఓట్లను తీసుకురాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన కుమారుడని, ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా కూడా జనాలు ఆయన్ని హీరోగా చూస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయరని బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. అస్సాంలోని బార్పేట జిల్లాలోని…
2024 ఎన్నికలకు ముందు అంటే అధికారం కోసం కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' చేపట్టబోతోంది. కాంగ్రెస్ ఈ యాత్ర 6,700 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాల్లో 67 రోజుల పాటు యాత్ర సాగనుంది.
మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లోనే నా ప్రయణం.. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నాను అన్నారు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని విలీనం చేశాం అన్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అన్నారు.