బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కె.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ వన్ నుండి మొదలైన బైక్ ర్యాలీ 9వ ఫేస్ వరకు కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి మద్దతుగా నిలుస్తూ అడుగున అడుగున…
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లిలో ఆయన తరుఫున కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు.