బీహార్‌లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్‌ను బీజేపీ రంగంలోకి దింపింది.
బీహార్ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకోవైపు అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది.