నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది. కోవెలముడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి…
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం మే23. నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు ఓ లేఖ రాశారు. ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే.. దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌కొట్టటంతోనా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు…