West Bengal Governor: ర్యాగింగ్‌ను గుర్తించే సాంకేతికతను కనుగొనండి.. ఇస్రోకి పశ్చిమ బెంగాల్ గవర్నర్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Governor: ర్యాగింగ్ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్ భూతం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ను కనుగొనే ఆధునిక సాంకేతికతను కనిపెట్టి.. ర్యాగింగ్ బారిని విద్యార్థులను రక్షించేలా చూడాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ కోరారు. ర్యాంగింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల ఇది కొనసాగుతూనే ఉంది. ఏటా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ రక్కసికి బలైపోతున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఈ క్రమంలోనే ర్యాంగింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ లేఖ రాసినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Secretariat: సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన సీఎం.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కొద్దిరోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయం (Jadavpur University)లో స్వప్నదీప్ అనే డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు స్వప్నదీప్ మృతికి సీనియర్ల వేధింపులే కారణమని తేల్చారు. ఈ మృతిపై యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు సాంకేతిక సాయం అందించాలని ఇస్రోను కోరారు. క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను సమర్థవంతంగా నిరోధించడానికి మరియు తొలగించడానికి తగిన సాంకేతికతను గుర్తించడానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి వి ఆనంద బోస్ మరియు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను సంప్రదించారు. గవర్నర్ బోస్ హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ADRIN)తో కూడా చర్చించారు. సాంకేతికత వీడియో అనలిటిక్స్, ఇమేజ్ మ్యాచింగ్, ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ మరియు రిమోట్ సెన్సింగ్ వంటి బహుళ వనరులను ఉపయోగించాలని భావిస్తున్నారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వర్సిటీ హాస్టల్‌లోని బాల్కనీలో నుండి పడి మృతి చెందిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థి మృతికి సంబంధించి మొత్తం 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!