కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీఏ
డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది. రాబడిని పరిగణనలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో, ఉద్యోగుల డీఏ అలవెన్స్‌పై ఆమోద ముద్ర పడవచ్చు. దానితో పాటు పెరిగిన డీఏను కూడా ప్రకటించవచ్చు.
ఎంపీ నుంచి ఎంపీటీసీల వరకూ అమ్ముకుంది చంద్రబాబే
మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో అన్నదాన సత్రాల ఏర్పాటు చేస్తామని 15 అప్లికేషన్లు వరకు వచ్చాయి.విలువైన భూములను అన్నదాన సత్రాలకు ఇస్తోన్నా.. వాటి ద్వారా ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు.ఛౌల్ట్రీలకు వచ్చే రూమ్ అద్దెల్లో 40 శాతం దేవస్థానానికి వచ్చేలా నిబంధనలు.కొత్త ఛౌల్ట్రీలే కాకుండా.. పాత ఛౌల్ట్రీల నుంచి ఆదాయం ఏ విధంగా రాబట్టవచ్చో ఆలోచన చేస్తున్నాం.బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 1330 దేవాలయాల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి.ఇవే కాకుండా మరో 1460 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.దేవాలయం లేని గ్రామం ఉండకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాం.దేవాలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం ఏఈలను ఔట్ సోర్సింగ్ పద్దతిన నియమించేలా చర్యలు.హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాల నిర్మాణం.5 వేల గుళ్లకు ధూప దీప నైవేద్యం కోసం నిధులిస్తున్నాం.చంద్రబాబు ఓ పిచ్చి కొడుకుని కన్నాడు.పిచ్చొడు పాదయాత్ర చేస్తున్నారు.లోకేష్ పాదయాత్రలో బూతులు మాట్లాడుతున్నాడు.. బూతు అర్దం వచ్చేలా సైగలు చేస్తున్నారు.చంద్రబాబు హయాంలో కరవు మండలాలు ఉన్నాయి.. జగన్ హయాంలో ఒక్క కరవు మండలం కూడా లేదు. లోకేష్ పాదయాత్ర చేస్తోంటే అన్ని అపశకునాలే అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
పదవులకు రాజీనామా చేసిన సిసోడియా, సత్యేంద్ర జైన్
ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆదివారం సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సిసోడియాకు సూచిస్తూ.. పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు సిసోడియాతో పాటు సత్యేందర్ జైన్ సైతం రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మనీలాండింగ్ కేసులో జైలులో ఉన్నారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది.
మీతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయా జగన్?
ఏపీలో ఎన్నికలకు ముందే వాతావరణం వేడెక్కుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఇవాళ తెనాలిలో సీఎం జగన్ విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్ రెడ్డికి ఒక్క స్థానంలో అయినా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా..?ఆర్థిక నేరస్తుడు, అరాచక వాది, నియంత అయిన జగన్మోహన్ రెడ్డి తీపి ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా…?పాలనాధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసమే పనిచేసే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటుంది.1983 నుంచి పలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం.. మరికొన్ని ఎన్నికల్లో కలిసొచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.ఎన్డీఏ, యూపీఏ, నేషనల్ ఫ్రంట్ వంటి అనేక కూటములు ఈ దేశాన్ని పాలించాయి.కొన్నింటిలో మేం కూడా భాగస్వాములయ్యాం.ప్రజలతో అధికారం పంచుకోవడం కోసమే పొత్తుల రూపంలో కొన్ని పార్టీలు కలిసివస్తున్నాయి.నియంత కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఎవ్వరూ కలిసివచ్చే ఆలోచన చేయడం లేదు.దాన్ని గొప్పగా అభివర్ణించుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ఏపీ సీడ్స్ అధికారులకు జగన్ ప్రశంసలు
అత్యంత ప్రతిభ, అవార్డులు అందుకుంటున్న ఏపీ సీడ్స్ సంస్థ అధికారులను అభినందించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వరుసగా రెండవ ఏడాది ఏపీ సీడ్స్ గవర్నెన్స్ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితం ఈ అవార్డు అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తుంది ఏపీ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్) .జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలకు అవార్డులు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తొమ్మిదేళ్ళుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది గవర్నెన్స్ నౌ అనే అంతర్జాతీయ సంస్ధ. ఈ ఏడాది పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్ నౌ అవార్డు లభించింది.
సక్సెస్ వచ్చిన తర్వాతే అసలు లైఫ్ మొదలౌతుంది: సొహైల్
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. రాజేంద్ర ప్రసాద్, సొహైల్, మృణాళిని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత సి. కల్యాణ్ కుమారుడు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ వేదికపై ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ”ఇప్పటి వరకూ నేను పనిచేసిన నిర్మాతలు ఒకటి, ఈ సినిమా నిర్మాత కల్పన గారు వేరొకటి. ఎందుకంటే.. ఇంతకు ముందు నేను నా నిర్మాతను ఏ ఆర్టిస్ట్‌ను, టెక్నీషియన్‌ను అడిగితే వారిని తెచ్చేవారు. కానీ కల్పన గారు మాత్రం నేను అడిగిన రేంజ్ వారికన్నా తగ్గేదేలే అంటూ ఇంకా పై రేంజ్ ఉన్న వారిని తీసుకొచ్చారు. అందుకే ఈవిడ స్పెషల్. ఈ సినిమా కోసం మేం పడ్డ తపనకు ఫలితం వచ్చే రోజు మార్చి 3న కావడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ”ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో ఫ్యామిలీ బంధాలను తెలుపుతూనే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్ చేసిన విధానం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాల పాయింట్స్ 20 సంవత్సరాల క్రితం వచ్చినవే. కాకపోతే కొత్త కొత్త హంగులు, ఆకర్షణలతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమాలో పిల్లల మీద ఉండే ప్రేమాభిమానాలు, కుటుంబంలో ఉండే ప్రేమానుబంధాలను అద్భుతంగా చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఇందుకు ఉదాహరణగా ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చెప్పాలి. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు ఖచ్చితంగా చెమర్చేలా ఈ ఎపిసోడ్ ఉంది. ఇందులో ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ ఉండవు. కానీ భావం మన మనసును ద్రవింపజేస్తుంది.
స్వీటితో ఎవడీ క్యూటీ
ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడేలా చేసాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. ఈ రెండు సినిమాలతో వరుస సినిమా అవకాశాలు అందుకోవడమే కాకుండా స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్న నవీన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా నవీన్.. యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ సరసన అనుష్క శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అనుష్క పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇందులో స్వీటీ.. చెఫ్ గా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచో ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానులు మరోసారి యూవీపై అసహనం వ్యక్తం చేయగా.. ఎట్టకేలకు ఒక తాజా అప్డేట్ తో వచ్చేశాడు జాతిరత్నం. రేపు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేయననున్నట్లు నవీన్ ఒక వీడియో ద్వారా తెలిపాడు.
కలిసి పనిచేద్దాం.. బిల్ గేట్స్ తో ఆనంద్ మహీంద్రా
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తన అధికారిక పర్యటన సందర్భంగా ఈరోజు భేటీ అయ్యారు. అంతకుముందు ముంబైలోని ఆర్‌బీఐ కార్యాలయంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశాన్ని ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ లో ధృవీకరించారు. వారి భేటీ ఐటీ వ్యాపారం గురించి కాదని.. సామాజిక చైతన్యం పై చర్చలు జరిగినట్లు ఆయన చెప్పారు.. గేట్స్ తన పుస్తకాన్ని ఆటోగ్రాఫ్ చేసి ఇస్తున్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. క్యాప్షన్‌లో, అతను ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు రాశారు. “@BillGatesని మళ్లీ చూడడం ఆనందంగా ఉంది. మా బృందాల మధ్య సంభాషణ మొత్తం IT లేదా ఏదైనా వ్యాపారం గురించి కాదు.. సామాజిక చైతన్యాన్ని పెంచడం కోసం మేము ఎలా కలిసి పని చేయవచ్చు అనే దాని గురించి.” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ముంబై ఇండియన్స్‌కి ఝలక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్
వెన్ను నొప్పి కారణంగా గత సెప్టెంబర్ నుంచి టీమిండియాకు దూరంగా ఉంటోన్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్ 2023లో కంబ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ, లేటెస్ట్ సమాచారం ప్రకారం అతడు ఐపీఎల్ కూడా దూరం కానున్నట్టు తేలింది. వెన్ను నొప్పి నుంచి ఇంకా కోలుకోకపోవడమే అందుకు కారణం. త్వరలోనే ఇతనికి సర్జరీ చేయనున్నట్టు తెలిసింది. ఇది ముంబై ఇండియన్స్ జట్టుకి పెద్ద ఝలకేనని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆ జట్టులో బుమ్రా అత్యంత కీలక ఆటగాడు. ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో మాయ చేసి, అతడు జట్టుని గెలిపించాడు. అలాంటి ఆటగాడు మిస్ అవ్వడం, ఆ జట్టుకి తీరని లోటేనని చెప్పుకోవాలి. అంతకుమించిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా బుమ్రా ఆడకపోవచ్చు. ఆస్ట్రేలియాను చిత్తు చేయడాన్ని బట్టి చూస్తుంటే, ఫైనల్స్‌కి భారత్ దాదాపు తన బెర్త్‌ని కన్ఫమ్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇది గుడ్ న్యూస్ అయినా, సర్జరీ కారణంగా బుమ్రా ఆ సమయానికల్లా కోలుకోవడం కష్టమే కాబట్టి, అతను అందుబాటులో ఉండకపోవచ్చు.