Hyderabad: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 10 మంది సీనియర్లు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. నిజానికి అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేస్తున్నారు. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి అక్రమార్కులు చట్ట ప్రకారం నేరమని, చట్టప్రకారం శిక్షార్హమని తెలిసినా కొందరు ఆకతాయి విద్యార్థులు మాత్రం పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. పరిచయం లేక ఇంటరాక్షన్ పేరుతో హద్దుమీరి వ్యవహరిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో వెలుగు చూసింది.
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులపై 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ఆ పది మంది సీనియర్ విద్యార్థులను హాస్టల్ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఏదైనా విద్యాసంస్థల్లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ర్యాగింగ్‌లను సహించేది లేదని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఏదైనా మెడికల్ కాలేజీలో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయితే ఇటీవల వరంగల్ మెడికల్ కాలేజీ వైద్యురాలు ప్రీతి సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఎందరో డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నా ర్యాగింగ్ కారణం కాదన్నారు. అయితే.. ఇలాంటి సమయంలో కూడా ర్యాగింగ్.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
Read also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. ములాఖత్ కు కుటుంబ సభ్యులు
తాజాగా ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కొన్నిచోట్ల ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ వేధింపులే కారణమని పోలీసులు ఇటీవల చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 7న పోలీసులు చార్జిషీటులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల, పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ రెండవ అంతస్తు నుండి పడి మరణించాడు. ర్యాగింగ్‌లో భాగంగా ఓ యువకుడిని నగ్నంగా ఊరేగించి, తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Redmi Note 13 Pro Series : అదిరిపోయే ఫీచర్స్ తో రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ వచ్చేస్తోంది…వివరాలివే..
తాజావార్తలు
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!