Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని హతమార్చారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కార్యాలయాలపై భీకరదాడులు చేసింది.
Rafale jets: జిత్తులమారి చైనా, ఎప్పటికప్పుడు వేరే దేశాల ఆయుధాలను కాపీ కొడుతూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలను తయారు చేస్తుంటుంది. అయితే, తాజాగా జరిగిన సంఘటన చూస్తే మరోసారి అదే పనిలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెంచ్ తయారీ రాఫెట్ ఫైటర్ జెట్ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు చైనా జాతీయులను గ్రీస్ దేశంలో అరెస్ట్ అయ్యారు. గ్రీస్‌లోని తనగ్రాలో రాఫెల్ ఫైటల్ జెట్స్ ఫోటోలు తీసినందుకు, హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(HAI) ఫెసిలిటీని చిత్రీకరించినందుకు…
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన…
సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో 'అజ్ఞాత ఎగిరే వస్తువు' (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్‌లను రంగంలోకి దించింది.