ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
సోమవారం నుంచి రెండు రోజులపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అక్కడి కీలక అధికారులతో ఆయన భేటీలో రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారంలో రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన వేళ ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలను, 3 స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాములను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది.