హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్‌మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్‌మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్‌తో పాటు…
హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో…
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచర్లు గొలుసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎల్బీనగర్ సంతోషి మాత దేవాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగత్. డిసెంబర్ 3, 4 తేదీలలో దేవాలయంలో అమ్మవారి నగలు చోరీ గురయ్యాయని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాం. సీసీటీవీ కెమేరాలతో పాటు దర్యాప్తు చేపట్టాం అన్నారు. ఇది అంతరాష్ట్ర దొంగల పని అని గుర్తించామన్నారు. ఐటి , సైబర్ క్రైమ్, స్పెషల్ టీమ్స్ తో గాలింపు చేపట్టాం. అంతరాష్ట్ర…
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండగ కావడంతో చాలా మంది వారం రోజుల పాటు స్వగ్రామాలలో గడిపేందుకు ఊరికి వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయం కోసం వేచిచూస్తున్న దొంగలు పలు చోట్ల రెక్కీలు నిర్వహిస్తున్నారు. దోపిడీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు . తాము ప్రజలను ఊరెళ్లొద్దని చెప్పడం లేదు కానీ, ఇంటికి…
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ అధికారి పేరుతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మ్యాట్రీమోనీలో హరిప్రసాద్ అనే యువకుడు ఐపీఎస్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ కనిపించడంతో ఆసక్తి కనపరిచిన మహిళలను హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళకు అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపించమని అడిగింది. దీంతో హరిప్రసాద్…