CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా…
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు
Rachakonda Police: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండు రోజుల్లో నుంచి హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో నగరంలో అనేక చోట్ల వాహనాలకు సంబంధించి చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం నాడు రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని వనస్థలిపురంలో ఒక కారు నాలోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి…
Rachakonda Police: తెలుగు రాష్ట్రాల్లో దసరా పెద్ద పండుగ. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక దసరా పండుగ సందర్భంగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారుకూడా వారి స్వస్థలాలకు బయలు దేరుతున్నారు.
Cyber Fraud: ఇటీవలి కాలంలో రోజుకో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది స్కామర్లు సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాలబాట ఆశ్రయిస్తున్నారు. అమాయక ప్రజల విశ్వాసాన్ని మాయమాటలతో దోచుకుంటున్నారు.
Rachakonda Police prohibitory orders: హైదరాబాద్ లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, శాంతిభద్రతలను కాపాడేందుకు జూన్ 24, ఉదయం 6 గంటల నుంచి జూన్ 30, ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించింది. పోలీసుల ఆదేశాల ప్రకారం, ఈ క్రింది చర్యలు నిషేధించబడ్డాయి. ముందస్తు అనుమతి లేకుండా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. కత్తులు, ఈటెలు, బరిసెలు, జెండాలతో…
LB nagar flyover: ఎల్‌బి నగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న 37 ఏళ్ల వ్యక్తిని చాకచక్యంగా మాటలో పెట్టి కానిస్టేబుల్ టి.సతీష్ కాపాడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Man severely injured due to Chinese Manja: చైనా మాంజాదారం ప్రజల పాలిట ఉరితాడులా మారుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత చైనా మాంజా దారాన్ని వాడుతున్నారు. గాలిపటాలు నేలపై పడిపోయినప్పుడు ఆ దారం ద్విచక్రవాహనదారులు, పాదచారులకు ప్రమాదంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వేగంగా బైకుపై వెళ్తున్న సమయంలో గొంతకు, మొహానికి చిక్కుకుని ప్రాణాలకు ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.
Robbery : హైదరాబాద్ నగరంలో దారి దోపిడీలు వణుకు పుట్టిస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసి దోపిడీ దొంగలు రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు.