Hyderabad Crime: సర్పదోషం పేరుతో 37 లక్షలు వసూళ్ళు.. ఫేక్ బాబాకు సంకెళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూఢనమ్మకాల మాయలో పడి ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు. వాళ్లను నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని డబ్బులు దోచుకుంటున్నారు నకిలీ బాబాలు.. ఇలాంటి ఫేక్ బాబాలను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. అంతర్ రాష్ట్ర నకిలీ బాబా ముఠాను అరెస్ట్ చేసామని తెలిపారు. భువనగిరి ఎస్‌వోటీ, భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో ముఠాను అరెస్ట్ చేసామన్నారు. రాజస్థాన్ లోని సీరోహి అనే ప్రాంతం నుండి వచ్చి మోసం చేస్తున్నారని తెలిపారు. అనేక పూజలు చేసి జబ్బులు నయం చేస్తాం అంటూ మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.
భువనగిరికి చెందిన కొండల్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అయితే కొండల్ రెడ్డి కొద్దిరోజుల ముందు బైక్ మీద నుండి కింద పడ్డారు. తనకు సర్ప దోషం ఉందని, పూజ చెయ్యకపోతే ప్రాణాలు పోతాయని కొండల్ రెడ్డి ని నమ్మించి మోసం చేసారని తెలిపారు. కొండల్ రెడ్డి వద్దనుంచి సర్ప దోషం పేరుతొ దగ్గర 37 లక్షలు 71 వేలు వసూలు చేశారని అన్నారు. దీంతో పోలీసులను కొండల్ రెడ్డి ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చిందని పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు. వారి వద్దనుంచి నగదు 8 లక్షలు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు పూజా సామానుస్వాదినం చేసుకున్నట్లు వివరించారు. ఇక్కడే కాకుండా పలు రాష్ట్రాల్లో ఇదే విధంగా మోసం చేసినట్టు వెల్లడైందని మహేష్ భగవత్ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!