మోహన్‌బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం కార్డియోలజీ, జనరల్ ఫిజీసియన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం అనుమతి తరువాత మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే ఇవ్వాళ రాచకొండ సీపీ యెదుట హాజరుకావాల్సి ఉండగా... మోహన్…
మంచు మనోజ్, మౌనిక జల్‌పల్లి నివాసంలోనే ఉన్నారు. ఉదయం 10:30 కి విచారణకు హాజరవ్వాలని మోహన్ బాబు, మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ బాబు భార్య.. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అదే ఆస్పత్రిలో విష్ణు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గన్‌లు కూడా సరెండర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులు..…
పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు.
Camera, Laptop and OutSide Food not allowed in Uppal Stadium: గురువారం ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయని, పోలీస్ అధికారులపై కూడా నిఘా ఉంచుతామని చెప్పారు. పీక్ హవర్స్‌లో మైదానానికి ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ పేర్కొన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు…
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Rachakonda Report: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు.
రాచకొండ పోలీసు కమిషనర్ గా జి. సుధీర్ బాబును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. సీపీడీఎస్ చౌహన్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు.. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తాం.. ప్రజలకు ఎల్లవేళలా…
మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్‌తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తన పేరుతో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాచకొండ కమిషనర్ కు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా తమను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ తెలిపారు.…
ఘట్కేసర్, మహేశ్వరం పోలీసుల బృందం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి మాదక ద్రవ్యాల రాకెట్ ఛేదించారు.. ఈ కేసులో డ్రగ్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేయడంతో పాటు 710 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
దారి దోపిడి కేసులో పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్‌ను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సర్వీసు నుంచి తొలగించారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీ పేరుతో 18.50 లక్షల నగదును ఏఆర్ కానిస్టేబుల్ బళ్లారి శ్రీకాంత్ కాజేసినట్లు విచారణలో తేలింది.