మంచు మనోజ్, మౌనిక జల్‌పల్లి నివాసంలోనే ఉన్నారు. ఉదయం 10:30 కి విచారణకు హాజరవ్వాలని మోహన్ బాబు, మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ బాబు భార్య.. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అదే ఆస్పత్రిలో విష్ణు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గన్‌లు కూడా సరెండర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులు.. మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుపై బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే.. రాత్రి గొడవ సమయంలో మనోజ్‌కి సైతం గాయాలు అయినట్లు సమాచారం.
READ MORE: South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపై దాడి..
కాగా.. జల్పల్లిలో జరిగిన ఘటనపై సీపీ స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక జలపల్లి లో జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ సీరియస్ అయినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఇక ఇప్పటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు చెందిన లైసెన్స్ గనులను పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు మోహన్ బాబు, విష్ణు. వీరిద్దరి గన్ లైసెన్సులను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
READ MORE: Govt Hospital: స్కానింగ్ మాఫియాతో చేతులు కలిపి.. సీల్డ్ కవర్లో డబ్బులు దండుకుంటున్న డాక్టర్లు!