BC Leaders Fight: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు ఆర్. కృష్ణయ్యతో కలిసి వచ్చిన బీసీ సంఘాల నేతలు ఈ ఘర్షణకు కారణమయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల తగువు పెరిగి, తోపులాట స్థాయికి చేరింది. ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు రామచంద్రరావు సమక్షంలో సమావేశమైన బీసీ సంఘం నేతలు గుజ్జ సత్యం, గుజ్జ…
శ్రీశైలం జలాశయానికి పోటేత్తిన వరద గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్‌లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. ఇప్పటికే…
R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన…
R. Krishnaiah: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, అల్ ఇండియా ఓబీసీ…
నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి. రెండు బిల్లులను ఆమోదించనున్న తెలంగాణ అసెంబ్లీ. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్‌లో కేబినెట్ భేటీ. నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు.…
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.
బీసీ హక్కుల ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య పొలిటికల్ అడుగులు తడబడుతున్నాయా? లేక తడబాటును సరి చేసుకుంటున్నారా? రాజకీయ రంగుల కంటే ఉద్యమ పంథానే బెటరని అనుకుంటున్నారా? లేక కొత్త పార్టీ గడప తొక్కబోతున్నారా? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా వెనక కృష్ణయ్య వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?
R. Krishnaiah: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సమావేశం అయ్యారు. విద్యా నగర్లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ రవి, కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా...రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా... ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?
బీసీ కులగణననతో పాటు.విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్.కృష్ణయ్య.పలువురు బీసీ సంఘాలతో కలిసి ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇంతవరకు కులగణన చేయడం లేదని.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిసి ల రిజర్వేషన్లు 42 శాతం కు పెంచడం లేదని కృష్ణయ్య ఆరోపించారు.…