వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలపై మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి మొహాన్ని కనబడకుండా చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు.సామాజిక న్యాయానికి సమాధులు కట్టి బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. వై.వి.సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన వాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..?ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ…
ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించిన ఆయన.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును, సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థులుగా…
త్వరతోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. అందులో ఒకటి బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. ఇక, ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.. ఈ సారి విజయసాయిరెడ్డి, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇవాళ…
బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభలో అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్లాన్‌గా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.. ఇక, ఆర్.కృష్ణయ్య ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.. ప్రస్తుతం బీసీ సంఘాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆర్. కృష్ణయ్య… గతంలో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహించారు.. ఇప్పుడు ఆర్.…
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి… 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. బీసీల పట్ల కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం.. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే లక్ష మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు..…