ఇరాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణంగా నరమేధం జరిగినట్లుగా అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరసనకారులకు ఏదైనా జరిగితే రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకోకబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన సైనిక విమానాలు ఖతార్‌లో మోహరించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Iran Protests: ఇరాన్‌లో నరమేధం.. ఎటుచూసినా శవాలే.. 12 వేల మంది చనిపోయినట్లుగా అంతర్జాతీయ కథనాలు!
ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక వైమానిక కార్యకలాపాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రపంచంతో ఇరాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ లేదు. అంధకారం అలుముకుంది. ఇదే అదునుగా భద్రతా దళాలు.. నిరసనకారులపై కాల్పులకు తెగబడడంతో 12 వేల మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రత్యక్ష చర్యలకు దిగబోతున్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ నేతృత్వంలో ‘ముస్లిం నాటో’గా అడుగులు.. ఏఏ దేశాలంటే..! భారత్‌కొచ్చే ముప్పేంటి?
ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో 10 వేల మంది అమెరికా సైనికులు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం B-2 బాంబర్లు, రవాణా విమానాలు వంటి పెద్ద సైనిక విమానాలు ల్యాండ్ అయ్యే రన్‌వే ఉంది. ఏదొక సమయంలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.