Tax Free On Salary: మనిషి పుట్టాక జీవితంలో తప్పనిసరిగా జరిగేవి.. మరణం, పన్నులు మాత్రమే అని ఓ ప్రసిద్ధ వ్యక్తి అన్నారు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రం ఈ మాట పూర్తిగా వర్తించదు. ఏంటి నిజమా..? అని అనుకుంటున్నారా.. అవునండి బాబు.. ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేసి సంపాదించిన జీతంపై వ్యక్తిగత ఆదాయ పన్ను (Personal Income Tax) అసలు ఉండదు.
దీనితో మీరు సంపాదించిన జీతంలో ప్రతి ఒక రూపాయి మీ చేతిలోనే ఉంటుంది. ఎలాంటి డిడక్షన్లు, రిబేట్లు, లేదా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే ఉండదు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇవి నిజంగా “శాలరీ హేవెన్స్” అని చెప్పాలి. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలే ఈ ‘జీరో ఇన్‌కమ్ ట్యాక్స్ పాలసీ’ని అమలు చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ దేశాల వివరాలు చుసేద్దమా..
Dhurandhar vs The Raja Saab: దురంధర్ రికార్డులను ‘రాజా సాబ్’ బద్దలు కొడతాడా..?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE):
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వ్యక్తులపై ఆదాయ పన్ను అసలు ఉండదు. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు తమ సంపాదనపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వస్తువులు, సేవలపై 5 శాతం మాత్రమే VAT ఉంటుంది. ఆరోగ్యానికి హానికరమైన కొన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం కంపెనీలకు వర్తిస్తుంది. UAEలో సంపాదించిన లాభాలను పూర్తిగా స్వదేశానికి పంపించుకునే స్వేచ్ఛ కూడా ఉంది.
సౌదీ అరేబియా:
సౌదీ అరేబియాలో కూడా ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంపై వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అయితే ఉద్యోగేతర ఆదాయానికి వేరు నిబంధనలు వర్తిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తల కోసం ప్రీమియం రెసిడెన్సీ వీసా సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
కువైట్:
కువైట్‌లో ఉద్యోగులు సంపాదించే జీతంపై ఎలాంటి ఆదాయ పన్ను లేదు. విదేశీ కంపెనీల తరఫున నామినీగా ఉన్న వ్యక్తులకు మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. ఇంకా సాధారణంగా ఉద్యోగుల జీతం పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అక్కడ.
ఖతార్:
ఖతార్ ప్రపంచంలోనే అతి తక్కువ పన్నులు ఉన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ వ్యక్తుల ఆదాయంపై పన్ను లేదు. కంపెనీలకు మాత్రం 10 శాతం కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్, షేర్ల విక్రయాల ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్స్ కూడా వ్యక్తులకు ట్యాక్స్ ఫ్రీగానే ఉంటాయి.
Meenakshi Chaudhary: అతనే నా క్రష్.. ఓపెనైన మీను..!
ఒమన్:
ప్రస్తుతం ఒమన్‌లో కూడా వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు. అయితే గల్ఫ్ దేశాల్లో తొలిసారిగా ఒమన్ 2028 జనవరి 1 నుంచి పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ అమలు చేయనుంది. ఏటా OMR 42,000 (సుమారు 1.09 లక్షల డాలర్లు) కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయితే ఈ నిబంధన వల్ల 99 శాతం ప్రజలకు ఎలాంటి ప్రభావం ఉండదని ఒమాన్ ట్యాక్స్ అథారిటీ స్పష్టం చేసింది.
గల్ఫ్ బయట ట్యాక్స్ ఫ్రీ బహామాస్, మోనాకో, సెయింట్ కిట్స్ అండ్ నీవిస్ దేశాల్లో కూడా వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేదు. ముఖ్యంగా హై నెట్‌వర్త్ వ్యక్తులు, రిటైర్మెంట్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ కోసం ఈ దేశాలను ఎంచుకుంటున్నారు. మొత్తంగా విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి జీతంపై పన్ను లేకపోవడం ఒక పెద్ద అడ్వాంటేజ్. ట్యాక్స్ ఫ్రీ శాలరీ వల్ల సేవింగ్స్ ఎక్కువగా పెరుగుతాయి. అయితే జీవన వ్యయం, వీసా నిబంధనలు, సామాజిక భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.