Qatar PM: ఖతార్ నుండి అమెరికాకు ఇచ్చే లగ్జరీ జెట్ విమానం బహుమతి వివాదంపై ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ స్పందించారు. ఇది వ్యక్తిగతంగా ట్రంప్‌కు ఇచ్చే బహుమతిగా కాకుండా, ప్రభుత్వ స్థాయిలో జరిగిన లావాదేవిగా ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మిడిల్ ఈస్ట్ పర్యటనలో భాగంగా ఖతార్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా ఖతార్ అమెరికాకు లగ్జరీ విమానం అందించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విమానాన్ని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు లేదా పదవీ విరమణ అనంతరంగానైనా వాడే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also: Assam Rifles operation: సైన్యం భారీ ఆపరేషన్.. మణిపూర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం..
ఈ విమర్శలపై స్పందించిన ఖతార్ ప్రధాని.. “ఇది వ్యక్తిగతంగా ఎవరికీ సంబంధించి కాదు. ఇది ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ మధ్య జరిగే లావాదేవీ. అంతే తప్ప ఇందులో ట్రంప్‌ను ప్రభావితం చేసే ఉద్దేశం లేదు” అని పేర్కొన్నారు. అలాగే ఖతార్ ఎప్పటికీ అమెరికాకు నమ్మదగిన మిత్రదేశంగా నిలిచిందని, ప్రతిసారి సహాయం అందించేందుకు ముందుంటుందని చెప్పారు. ఈ స్నేహం పరస్పర ప్రయోజనాలపై ఆధారపడాలి.. ఇది ఒకవైపు ఉండకూడదని ఆయన అన్నారు.
Read Also: RRR 2 : త్రిబుల్ ఆర్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..
ఇదివరకే ట్రంప్, బోయింగ్ సంస్థ తయారు చేస్తున్న కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలపై ఆలస్యాలు, అధిక ఖర్చులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖతార్ ఇచ్చే విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగపడుతుందన్న వార్తల నేపథ్యంలో, మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో ట్రంప్ “ఇలాంటి బహుమతిని తిరస్కరించటం తెలివివంతుల పని కాదంటూ” అంటూ మండిపడ్డారు.