Harish Rao: మత్స్యశాఖ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూగజీవాలకు కూడా విస్తృత సేవలు అందుతున్నాయన్నారు.
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశం ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తేవడమేకాకుండా.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారని అన్నారు. యువత ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…
నేడు స్థిత ప్రజ్ఞుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషాకోవిదుడి పేరుగాంచిన భారతదేశ పూర్వ ప్రధాని పి.వి. నరసింహారావు 101వ జయంతి జయంతి. పి.వి. నర్సింహారావు 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నెపల్లిలో జన్మించారు. నర్సింహారావు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పెరిగి.. రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎన్నో అత్యున్నత పదవులను అధిష్టించారు. కానీ.. అప్పటిపరిస్థిల్లో ఈ దేశంలో సామాన్యుడు గద్దెనెక్కడం అనేది అంతా ఓ భ్రమ. పేరుకు ప్రజాస్వామ్య దేశమే అయినా,…
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శిబిర్ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పలు వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేయనుంది. ఇప్పటికే ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు నవ సంకల్ప్ శిబిర్‌కు హాజరు కానున్నారు. కాగా ఉదయ్ పూర్‌లో ఎటు…
గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో అడుగు ముందుకేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పాన్ ఇండియా బై లింగువల్ వెబ్ సిరీస్ ను రూపొందించబోతోంది. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుపై వినయ్ సీతాపతి రాసిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా ఈ రెండు సంస్థలు కలిసి ఓ వెబ్ సీరిస్ ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను ప్రముఖ నిర్మాత, .గీతా ఆర్ట్స్…
పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన…
సంప్రదాయాల గురించి చర్చించే సామాజిక వేదికల్లో తరచూ దర్శనమిచ్చే ఫోటో ఇది. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో నటులు, మాజీ ముఖ్యమంత్రులు యన్టీఆర్, ఎమ్జీఆర్ కలసి కింద కూర్చుని భోంచేస్తున్న ఫోటో! ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కావడం విశేషం! ఇక ఈ ఫోటో 1972 సంవత్సరంలో తీసినది. అప్పట్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అదే సమయంలో తెలుగునేలపై ‘జై ఆంధ్రా ఉద్యమం’ తీవ్రంగా సాగుతోంది. అంతకుముందు ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’ కూడా తీవ్రస్థాయిలోనే సాగింది.…
తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చే వాటిలో నెక్లెస్ రోడ్ కూడా ఒక్కటి. అయితే ఈ నెక్లెస్ రోడ్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళిగా నెక్లెస్ రోడ్ పేరును పీవీఎన్ఆర్ మార్గ్ గా మార్చింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జరిగిన తెలంగాణ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 1921 జూన్ 28 న పుట్టిన…