నిజామాబాద్ నగర శివారులోని బొర్గం వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వానిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పీవీ మేధో సంపత్తి ఉన్న వ్యక్తి అని కొనియాడారు. విద్య మంత్రిత్వ శాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చిన ఘనత పీవీది అని ఆమె అన్నారు. అంతేకాకుండా… నవోదయ కాన్సెప్ట్ కూడా పీవీదే అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Data Protection Bill: పర్సనల్ డేటా రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కాంగ్రెస్ వాళ్ల ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, మన్మోహన్, పీవీ కాంబినేషన్ వల్లే భారత దేశం గట్టెకిందని ఆమె అన్నారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ అటుంవటి విషయన్ని కూడా మరిచి పోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. కానీ పార్టీ పీవీ నరసింహారావును గుర్తించలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీకి నీతీ లేదని ఆమె విమర్శలు గుప్పించారు. కానీ కేసీఆర్ మాత్రం శత జయంతి ఉత్సవాలు చేశారని, ఇంకా పీవీ స్ఫూర్తివంతంగా ఉండేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Also Read : CS Jawahar Reddy: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ సమీక్ష