India-Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం భేటీ అయ్యారు. మాస్కోల ఈ ఇదద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. “ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సమస్యలపై విస్తృత చర్చ జరిగినట్లు వెల్లడించింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై విస్తృత చర్చ జరిగిందని, భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే పనిని కొనసాగించడానికి ఇరువురు అంగీకరించారు. దోవల్ తన రెండు రోజుల పర్యటన కోసం బుధవారం రష్యా వెళ్లారు.
Read Also: Lover Attack: ఆకతాయి దుశ్చర్య.. భర్తని వదిలెయ్ నాతో వచ్చెయ్.. కట్ చేస్తే..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి ఏడాది గడుస్తోంది. యుద్ధం ప్రారంభం నుంచి భారత్ ఈ విషయంలో తటస్థంగా ఉంది. ఇరు దేశాలు దౌత్యమార్గాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. రష్యాపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా.. వీటన్నింటిని లెక్క చేయకుండా రష్యా నుంచి డిస్కౌంట్ పై భారత్ క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోంది. దీనిపై పలుమార్లు వెస్ట్రన్ కంట్రీస్ భారత్ పై ఒత్తడి తెచ్చినా, భారత్, రష్యా సంబంధాల విషయంలో స్థిరంగా ఉంది. భారత్ నుంచి రష్యా కూడా కొన్ని వస్తువులు ఎగుమతి చేయాలని కోరింది. రష్యా, భారత్ కు దశాబ్ధాలుగా వ్యూహాాత్మక భాగస్వామిగా ఉంది. మిలిటరీ, స్పేస్ టెక్నాలజీలో ఇరు దేశాల మధ్య బంధం బలంగా ఉంది.