Ukraine War: ఉక్రెయిన్, రష్యాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాలోని సుదూర లక్ష్యలను కొట్టేలా, సుదూర క్షిపణులను ఉపయోగించుకునేందు జో బైడెన్ ఉక్రెయిన్‌కి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధంలో సంఘర్షణ స్థాయిని పెంచింది.
North Korea-Russia: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కోకు మద్దతుగా నార్త్ కొరియా పెద్ద మొత్తంలో సైనిక సాయం అందిస్తుంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా సహజ వనరులు మంత్రి అలెగ్జాండర్ క్లోజోవ్ సమావేశం అయ్యారు.
Alexei Zimin: రష్యన్ సెలిబ్రిటీ చెఫ్, పుతిన్‌ని విమర్శించే 52 ఏళ్ల అలెక్సీ జిమిన్ అనుమానాస్పద రీతిలో మరణించారు. సెర్బియాలో ఓ హోటల్ గదిలో శవంగా కనిపించాడు. 2014లో రష్యా ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను స్వాధీనం చేసుకోవడంపై జిమిన్ పుతిన్‌ని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలంటూ పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని పలు సందర్భాల్లో ట్రంప్ చెప్పాడు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది.
ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ సమావేశాన్ని పుతిన్ విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు.
ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ చేరుకున్నారు. బ్రిక్స్ సమావేశంలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు…
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్- లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.