Putin: ఉక్రెయిన్‌లో ఏకపక్షంగా ఈస్టర్ కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ఆదివారం వరకు శత్రుత్వాన్ని ముగించాలని రష్యన్ బలగాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. శనివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఈస్టర్ సంధిని పుతిన్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి.
Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా దాడుల వల్ల కలిగిన విధ్వంసాన్ని చూడాలని కోరారు. ‘‘దయచేసి, ఏ విధమైన నిర్ణయాలు, ఏ రకమైన చర్చలు జరపడానికి ముందు, ఉక్రెయిన్‌లో ప్రజలు, ఆస్పత్రులు, చర్చిలు, పిల్లలు ఎలా నాశనం చేయబడ్డారో, చనిపోయారో చూడటానికి రండి’’ అని ఆదివారం జెలెన్స్కీ, ట్రంప్‌ని కోరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. ‘‘త్వరలోనే పుతిన్ చనిపోతారు’’ అని, ఇది రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని అన్నారు. పారిస్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ పుతిన్ ఆరోగ్యం పరిస్థితులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అతను(పుతిన్) త్వరలోనే చనిపోతారు. ఇది…
Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి ఇప్పటికే శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరిగించాయి. పలుమార్లు జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఇక మంగళవారం మరొక కీలక అడుగుపడనుంది.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల భవనాలు నెలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశాడు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ పుతిన్‌కు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ దళాలు పూర్తిగా చుట్టుముట్టబడ్డాయని ట్రంప్ తెలిపాడు. యుద్ధంతో ఉక్రెయిన్ చితికి పోయిందని కనికరం చూపాలని ట్రంప్…
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యాకు సంబంధించిన భూభాగాలు అప్పగించాలంటూ ట్రంప్ సూచించారు.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, ఈ విషయాన్ని రష్యా ధృవీకరించలేదు, అలాగని ఖండించలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడం గురించి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఉక్రెయిన్‌లో సంఘర్షణను ముగించడం గురించి తాను పుతిన్‌తో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని , “ప్రజలు చనిపోవడం ఆపాలనే” కోరికను పుతిన్ వ్యక్తి చేసినట్లు నివేదించింది. Read Also: Biren Singh:…