పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరి వారి పాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందడం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమ చేసారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆమె తీవ్ర సంతాపం తెలిపింది. ఈ సంఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
Also Read: Tadipatri: పోలీసుల వలయంలో తాడిపత్రి పట్టణం..
చిన గంజాం నుండి ఓటు వేసి తిరిగి హైదరాబాద్ పయనమైన ప్రయాణీకులు రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు దుర్మరణం పాలయ్యారన్న వార్త తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది., గాయపడిన వారికి సహకరించాలని బీజేపీ శ్రేణులుకు ఆదేశం ఇచ్చారు ఆమె. అలాగే ప్రమాద ఘటన పై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఓ బస్సును ఢీకొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. అలాగే బస్సు లోని 20 మంది గాయపడ్డారు.